విష్ణు ప్యానెల్ నన్ను చూసి భయపడుతున్నారు.. అందుకే నా భర్త మోహన్ బాబును కలిసి ధైర్యం చెప్పారు

jeevitha reacts About Manchu Vishnu comments
jeevitha reacts About Manchu Vishnu comments

మా ఎన్నికల్లో రోజురోజుకు చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి ఒకరు కామెంట్లు, విమర్శకలు చేసుకుంటూ ఇండస్ట్రీ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ ప్యానెల్ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాడు. నటి జీవిత మీద కూడా ఫైర్ అయ్యాడు. జీవిత భర్త రాజశేఖఱ్ తన తండ్రి మోహన్ బాబును కలిసి చాలా విషయాలు చెప్పాడని విష్ణు చెప్తుండగా.. పక్కనే ఉన్న నరేష్.. ఇప్పుడు అవన్నీ చెప్పొద్దు అంటూ వారించాడు.

jeevitha reacts About Manchu Vishnu comments
jeevitha reacts About Manchu Vishnu comments

కాగా.. మంచు విష్ణు కామెంట్స్ మీద జీవిత స్పందించింది. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్.. మోహన్ బాబును ఎందుకు కలిశారో కారణాలు చెప్పింది. నా భర్త.. మోహన్ బాబును కలిసింది నిజమే. ఆయన హీరోగా మేము నిర్మిస్తున్న ఓ సినిమా షూటింగ్ గత నెల రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ రోజు తాను షూటింగ్ కు అరగంట లేట్ గా వస్తానని చెప్పారు. ఎందుకు అని అడగగా.. వచ్చే దారిలో మోహన్ బాబు గారిని కలిసి వస్తాను అని చెప్పాడు. దానికి నేను సరే అన్నాను.. అని జీవిత చెప్పారు. మా ఎన్నికల నేపథ్యంలో ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వివాదాలపై రాజశేఖర్.. మోహన్ బాబుతో చర్చించారని జీవిత తెలిపారు. చిరంజీవి – మోహన్ బాబు కుటుంబాల మధ్య మా వేదికగా ఆధిపత్య పోరు జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి.. వివాదాలు సద్దుమణిగేలా చూడాలని మోహన్‌బాబుకు రాజశేఖర్ సూచించారు. అంతే తప్ప ఆయన వేరే ఏం మాట్లాడలేదు అని జీవిత తెలిపారు.


తనని సస్పెండ్ చేస్తానని కామెంట్ చేసిన నరేష్ వ్యాఖ్యలపై కూడా జీవిత స్పందించారు. ఈ మధ్య నేను పెట్టిన ఓ ప్రెస్ మీట్ లో వారికి ఓటు వేయకండి అని సభ్యులకు సూచించానని ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ నన్ను సస్పెండ్ చేస్తానని బెదిరించారు. ఎందుకు నన్ను సస్పెండ్ చేస్తారు? నేను చేసిన తప్పేంటి? అని ఆమె ప్రశ్నించారు. పోస్టల్ బ్యాలెట్ మీద నేను చేసిన వ్యాఖ్యల్ని వదిలేసి కేవలం ఓటు వేయకండి అనే పదాన్నే పట్టుకొని మాట్లాడటం సరికాదని ఆమె అసహనం వ్యక్తం చేసింది. నన్ను సస్పెండ్ చేయాలనుకుంటే చేయండి.. చూసుకుంటా. ఆ ప్యానల్‌ వాళ్లందరూ నన్ను చూసి భయపడుతున్నారు.. అని జీవిత అన్నారు.