‘లావు’గా ఉందని జాబ్ నిరాకరణ.. పోస్ట్ వైరల్

Job denial of being 'fat'

కంపెనీలు తమ అవసరాలకు తగ్గ ఉద్యోగులను వెతికిపెట్టమని రిక్రూట‌ర్ల‌కు అప్ప‌గిస్తుంటాయి. ఈ క్రమంలో ఆయా ఉద్యోగాల‌కు స‌రిపోయే స‌రైన క్యాండిడేట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కోసారి రిక్రూట‌ర్లు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ల‌ను కంపెనీలకు నచ్చక.. చిన్న చిన్న కార‌ణాలు చెప్పి రిజెక్ట్ చేస్తుంటారు.

తాజాగా ఇటువంటి ఘ‌ట‌నే ఒక‌టి యూకేలో చోటు చేసుకుంది. కానీ సదరు కంపెనీ చెప్పిన సిల్లీ రీజ‌న్ చెప్పి ఉద్యోగానికి రిజెక్ట్ చేసిన ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ప్రాప‌ర్టీ రిక్రూట్‌మెంట్ సంస్థ డైరెక్ట‌ర్ ఫాయె ఏంజెలెట్టా త‌న క్ల‌యింట్ కంపెనీలో సేల్స్ పొజిష‌న్ కోసం ఇంట‌ర్వ్యూలు తీసుకుంది. ఒక యువ‌తిని సెలెక్ట్ చేసుకుని.. డిటెయిల్స్ క్ల‌యింట్‌కు పంపించింది. ఆ క్ల‌యింట్ మాత్రం ఆ యువ‌తిని రిజెక్ట్ చేశారు.

అయితే రిజెక్ట్ చేసిన కార‌ణం చూసి ఏంజెలెట్టా షాక్ అయింది. సదరు యువ‌తి లావుగా ఉంద‌ని అందుకే త‌న‌ను ఆ ఉద్యోగానికి ఎంపిక చేయ‌లేద‌ని క్ల‌యింట్ నుంచి స‌మాధానం వ‌చ్చింది. వాస్తవానికి తను అంత లావుగా లేదు. త‌న సైజ్ 16 మాత్ర‌మే. అది యూకేలో కామ‌న్. అక్కడ దాదాపు 44 శాతం మహిళలు అంతకంటే ఎక్కువే ఉంటారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి కార‌ణాల‌తో ఉద్యోగుల‌ను రిజెక్ట్ చేయ‌డం చూడ‌లేదని, ఇప్పుడు తను ఆ యువ‌తికి ఎలా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అంటూ ఏంజెలెట్టా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదే విషయాన్ని సదరు యువతితో చెప్పింది.

జాబ్ కోసం ఎంపిక యువతి.. త‌ను క్యాన్స‌ర్‌తో పోరాటంలో భాగంగా స్టెరాయిడ్స్ తీసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే కాస్త లావెక్కానని వాపోయింది. ఈ విషయాన్ని కూడా రిక్రూట‌ర్ ఏంజెలెట్టా.. క్ల‌యింట్‌కు చెప్పి వివరించినా మళ్లీ అక్కడి నుంచి నో అనే స‌మాధాన‌మే వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చింది.