తెరాసలోకి బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు.. హరీష్ రావు ఆధ్వర్యంలో చేరిక

Joining In TRS From BJP
Joining In TRS From BJP
Joining In TRS From BJP
Joining In TRS From BJP

కేంద్రంలో బీజేపీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ అనుబంధ సంస్థ బీజేపీ కిసాన్ మోర్చాకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కరీంనగర్ జిల్లా కిసాన్ మోర్చా నాయకుడు గూడూరి శ్రీనివాస్ రెడ్డి తెరాసలో చేరారు.

బీజేపీకి రాజీనామా చేసి.. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఆయన తెరాసలో చేరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ లాంటి నాయకులే కావాలని.. అప్పుడే ప్రజలు బాగుంటారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శ్రీనివాస్ రెడ్డికి గులాబీ కండువా కప్పి.. మంత్రి హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పలు ఆటో ట్రాలీ నాయకులు, సభ్యులకు టీఆర్ఎస్ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.