అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటిముందు గొడవ.. పోలీసుల లాఠీఛార్జ్

police lathicharge on jr ntr fans
police lathicharge on jr ntr fans

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఇవాళ. దీంతో ఆయన అభిమానులు తెగ హల్ చల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణే. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ని ఎన్టీఆర్ ఏలేస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే అంటే ఆయన అభిమానులకు పండగ రోజు. సన్నిహితులు ముద్దుగా పిలుచుకొనే… తారక్ ఇవాళ 39వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరో, యంగ్ టైగర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున చేరుకొని హడావుడి చేస్తున్నారు. రాష్ట్రం నలువైపుల నుండి ఎన్టీఆర్ ఇంటి వద్దకు భారీగా ఫ్యాన్స్ రావటంతో తారక్ ఇంటి పరిసరాల్లోని రోడ్లన్నీ పెద్ద ఎత్తున రద్దీగా మారాయి.

జై ఎన్టీఆర్ నినాదాలిస్తూ.. కేక్స్ కట్ చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే            ఈ సమయంలో అభిమానుల మధ్య చిన్నపాటి గొడవ కూడా చోటుచేసుకుంది. ఫ్యాన్స్ చేస్తున్న హంగామా చూసి పోలీసులు కూడా భారీగానే బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. అభిమానుల అల్లరి శృతి మించి అల్లరి ఎక్కువ కావడంతో ఇక పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులని చెదరగొట్టారు. అర్థరాత్రి కొందరు అభిమానులు తారక్ ఇంటి వద్దకు చేరుకొని బాణాసంచా కాల్చి హడావుడి చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావుడితో ఆ ప్రాంతవాసులకు అర్ధరాత్రి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక పోలీసులు ఎంత చెప్పినా అభిమానులు వెనక్కి తగ్గకపోవడంతో లాఠీ చార్జ్ చేసి అభిమానులని తరిమికొట్టారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇలా అభిమానుల మీద లాఠీచార్జ్ చేయడం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా అర్దరాత్రి నడి రోడ్డు మీద హంగామా చేయడాన్ని కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు.