కరాటే కళ్యాణితో నాకు ప్రాణహాని ఉంది.. ప్రాంక్‌స్టార్ శ్రీకాంత్ రెడ్డి షాకింగ్ వీడియో..!

karate kalyani youtuber srikanth reddy controversy
karate kalyani youtuber srikanth reddy controversy

సినీ నటి కరాటే కల్యాణి, యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. శ్రీకాంత్ రెడ్డిని వదిలేది లేదని కరాటే కల్యాణి తెగేసి చెబుతోంది. అతను జైలుకు వెళ్లాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఫ్రాంక్ వీడియోలతో మహిళలను అవమాన పరుస్తున్నారు అని అలాగే హిందువులను కూడా అవమాన పరిచే విధంగా అతను వీడియోలు చేస్తున్నాడు అంటూ కరాటే కళ్యాణి ఆరోపిస్తూ అతనిపై చేయి చేసుకుంది. అయితే కొద్ది సేపటి క్రితం శ్రీకాంత్ రెడ్డి కూడా తన వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. కరాటే కల్యాణితో తనకు ప్రాణ హాని ఉందని శ్రీకాంత్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశాడు. ‘నేను నా ఇంటి దగ్గర ఉండగా.. కరాటే కళ్యాణి.. తన ముగ్గురు అనుచరులతో కలిసి నా ఇంటికి వచ్చి.. లోపల ఉన్న నన్ను బయటకు రారా అంటూ దూషిస్తూ.. దాడి చేశారు. కరాటే కళ్యాణి కూడా వ్యాంప్ పాత్రలు చేసింది.. అడల్ట్ కంటెంట్ ఉన్న పాత్రలే చేసింది. మీరు చేస్తే తప్పు లేదు.. నేను చేస్తే తప్పేంటని అడగాను. ఇది నా బతుకుతెరువు.. నేనూ ఆర్టిస్ట్‌నే అని చెప్పాను. ఇక ఆమె లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వాలి అని బ్లాక్మెయిల్ చేసింది. నాకు మహిళా సంఘాలు తెలుసు ప్రభుత్వ అధికారులు తెలుసు అంటూ నన్ను బెదిరించింది. కావాలని నాపై మానభంగం కేసు పెట్టింది. ఇప్పుడు జనాల సపోర్ట్ నాకు అవసరం ఉంది. కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. నేను అయితే ఏ తప్పు చేయలేదు. శృతి మించి కూడా చేయలేదు. కావాలనే కరాటే కళ్యాణి ఈ విధంగా తప్పు చేసింది. నేను నిజంగా ఏదైనా తప్పు చేసి ఉంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాల్సింది. కానీ ఆమె కంప్లైంట్ ఇవ్వకుండా నా పై చేయి చేసుకోవడం నాకు నచ్చలేదు. ఆమె నన్ను చాలా భయంకరంగా బెదిరిస్తోంది. నిన్ను చంపేస్తాను నాకు తెలిసిన మనుషులు ఉన్నారు అని బెదిరించింది. కాబట్టి నాకు సపోర్ట్ చేయవల్సిందిగా కోరుతున్నాను’  అని శ్రీకాంత్ తెలియజేశాడు.