సర్జరీ వికటించి మరణించిన సినీ నటి కేసులో ట్విస్ట్.. మృతికి కారణం అతనే

karnataka actress chethana raj death mystery
karnataka actress chethana raj death mystery

కన్నడ టీవీ నటి చేతనారాజ్‌ మృతికి కారణమైన ప్రైవేట్‌ ఆస్పత్రికి ఆరోగ్యశాఖ అధికారులు నోటీసులిచ్చారు. కొవ్వును కరిగించడానికి జరిగిన సర్జరీ విఫలమై నటి మూడు రోజుల కిందట మరణించడం తెలిసిందే. ఈనెల 16న సర్జరీ కోసం ఆమె ఆస్పత్రిలో చేరింది. సర్జరీ అయ్యాక సడెన్ గా ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా నీరు చేరిపోయింది. ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేసినా.. ఆమె ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె ఆకాల మరణానికి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రి ముఖ్య వైద్యుడు డాక్టర్‌ గౌడశెట్టికి నోటీసులిచ్చి ఆస్పత్రిని మూసివేశారు. నటి మృతిపై వివరణ ఇవ్వాలని సూచించారు. కూతురి మృతిపై అనేక అనుమానాలున్నయని మృతురాలి తండ్రి వరదరాజ్‌ సుబ్రమణ్యనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి డాక్టర్‌ గౌడశెట్టితో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇక ఇలాంటి లైపో సర్జరీలు కేవలం చేతన రాజ్ మాత్రమే కాదు.. హీరోయిన్స్ కూడా ఎక్కువగా చేయించుకుంటున్నారు. కానీ వాళ్లు విదేశాలకు వెళ్లి మంచి ఆస్పత్రుల్లో వీటిని చేసుకుంటున్నారు. రిస్క్ అని తెలిసినా శరీరాకృతి కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హీరోయిన్ల అందమే వారిని ఈ దుస్థితికి దిగజార్చేలా చేస్తోంది. వారి ప్రాణాలు తీస్తోంది.