నవంబర్ 5 నుంచి శ్రీశైలంలో కార్తీక వేడుకలు.. ఏర్పాట్లు సమీక్షించిన ఈవో

Karthika utsavam Started In On November 5th in Srishailam
Karthika utsavam Started In On November 5th in Srishailam
Karthika utsavam Started In On November 5th in Srishailam
Karthika utsavam Started In On November 5th in Srishailam

నవంబర్ 5 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీశైల భమ్రరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వేడుకలను ఆయన పర్యవేక్షించారు. ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు, భక్తులకు కల్పించాల్సిన సైకర్యాలు, పార్కింగ్, దీపోత్సవం, పుష్కర స్నానం వంటి అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన భక్తుల స్పర్శ దర్శనాలు.. తిరిగి ప్రారంభించాలా.. వద్దా అనే విషయంలో సమీక్షలు జరుపుతున్నారు. భక్తులకు కేవలం అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్టు ఈవో తెలిపారు. ఉదయం 3:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు.. సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.


కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నాలుగు విడతలుగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్నదానం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు నిర్వహించనున్నారు. దర్శనం కోసం క్యూలో ఉన్న భక్తులకు మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం అందించనున్నారు. కార్తీక మాసం సందర్భంగా అఖండ శివచతుస్సప్తాహ భజన, నిరంతర శివ భజనలు, పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన, పుష్కర హారతి, దీపారాధన, ఉత్తర మాడవీధి, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. పౌర్ణమి నాడు పాతాళగంగ వద్ద కృష్ణవేణి నదికి పుణ్యహారతి, గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణం ఏర్పాటు చేయనున్నారు. నిత్య భజనలు, ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.