కెన్యా అథ్లెట్‌ అగ్నెస్‌.. అనుమానాస్పద మృతి

Kenyan athlete Agnes

Kenyan athlete Agnes

కెన్యా మహిళా రన్నర్‌ అగ్నెస్‌ టిరోప్‌ అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. 25 ఏళ్ల అగ్నెస్‌ ఇంట్లోనే మరణించిందని, ఆమె మృతికి గల కారణాలు తెలియలేదని కెన్యా ట్రాక్‌ సమాఖ్య చెప్పింది. ఇంట్లోనే విగతజీవిగా పడి మరణించడంతో అగ్నెస్‌ భర్తపై అనుమానాలను ట్రాక్‌ సమాఖ్య వ్యక్తం చేస్తోంది.

అగ్నెస్‌ టిరోప్‌.. 2017, 2019 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్ లలో 10 వేల మీటర్ల విభాగంలో రెండు కాంస్య పతకాలు గెలిచింది. గత ఆగస్టులో ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో 5000 మీటర్ల పరుగులో నాలుగో స్థానంలో నిలిచింది.