బీజేపీ మతం పేరిట సమాజాన్ని విభజిస్తోంది

K. Keshava Rao

వజ్రోత్సవ వేడుకలు పోటీగా చేయడం లేదని..సాయుధ పోరాటంలో, స్వతంత్ర ఉద్యమాల్లో ఉన్నవారిని గుర్తు చేసుకుంటున్నామన్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే. కేశవరావు. జాతీయ ఐక్యత..మత సామరస్యం ఉండాలని ఆనాడు కోరుకున్నారని తెలిపారు. ఫెడరలిజం పెంపొందించాలి, బలోపేతం చేయాలకున్నారని…మోడీ అధికారంలోకి వచ్చాక ఫెడరలిజం బోగస్ చేశారని..ప్రజాస్వామ్యం లేదని అన్నారు.

మతం పేరిట సమాజాన్ని బీజేపీ విభజిస్తోందన్నారు కేశవరావు. ఆర్థిక, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ సంస్థల అమ్ముకోవడం చేస్తున్నారని విమర్శించారు. హెల్త్, విద్యపైన బీజేపీ ఎలాంటి దృష్టి సారించడం లేదన్నారు. ఏడేళ్లలో మోడీ ప్రభుత్వం ఏమి చేసింది.. తెలంగాణ ఏం చేసిందో చూడాలన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందన్నారు. అన్ని రంగాల్లో మా ఆర్థిక స్థితి డబుల్ అయ్యిందని తెలిపారు.

అద్భుతమైన పాలనతో సీఎం కేసీఆర్ దేశానికి ఒక ఆశ కల్పించారని తెలిపారు కేశవరావు. దేశం మొత్తం బీజేపీతో లేదు.. ఎన్నికల్లో వాళ్లకు వచ్చిన ఓట్ల శాతం చూడాలన్నారు.

పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అందరితో చర్చించి మార్గరెట్ అల్వాకు మద్దతు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారన్న కేశవరావు..రేపు టీఆర్ఎస్ పార్టీ 16 మంది ఎంపీలం మార్గరెట్ అల్వాకు ఓటు వేస్తామన్నారు.