నకిలీ విత్తనాలపై ఖమ్మం పోలీసుల ఉక్కుపాదం - TNews Telugu

నకిలీ విత్తనాలపై ఖమ్మం పోలీసుల ఉక్కుపాదం 

నకిలీ విత్తనాలపై ఖమ్మం పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారు. లైసెన్స్ లేకుండా అక్రమ మార్గంలో మిరప విత్తనాలు రైతులకు  అంటగడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.16లక్షల విలువైన విత్తనాలు సీజ్ చేసినట్టు ఖమ్మం సీపీ విష్ణువారియర్ చెప్పారు.

సత్తుపల్లి సర్కిల్ లోని కల్లూరు , ఏన్కూర్, జూలూరుపాడు, చండ్రుగొండ, ఖమ్మం కి చెందిన వ్యక్తుల నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయాధికారులు దాడులు చేశారు. కొంత మందిని అరెస్టు చేశామని, మరికొంత మంది ని త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ వివరించారు.

కర్ణాటక  కు చెందిన ఓ వ్యక్తి ఈ ముఠాలో కీలక వ్యక్తి అని, విచారణ కొనసాగుతుందని సీపీ అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మకాలు చేపట్టిన వారి పై పిడి యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు బిల్లులు లేకుండా విత్తనాలు కొనవద్దని సీపీ సూచించారు. నకిలీ విత్తనాల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన అధికారులకు సీపీ విష్ణు వారియర్ అభినందించారు.