సమంతనే విడాకులు కోరుకుంది.. చైతు చాలా బాధ పడ్డాడు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్..!

Nagarjuna About Samantha Naga Chaitanya Divorce
Nagarjuna About Samantha Naga Chaitanya Divorce

అక్కినేని ఫ్యామిలీ మూవీ ప్రమోషన్స్ లో వారి సినిమాల కంటే ఎక్కువగా సమంత, చైతుల విడాకుల అంశమే సెన్సేషన్ అవుతూ వస్తుంది. 2021 అక్టోబర్ 2న తామిద్దరం విడిపోతున్నామని సామ్ చై జంట బాంబు లాంటి వార్తని బ్లాస్ట్ చేయగా ఆ తరువాత ఈ విషయాన్నీ ధ్రువీకరించారు నాగార్జున. ఇక ఆ రోజు నుండి ఈ జంట విడాకులపై కుప్పలు తెప్పలుగా గాసిప్స్ వచ్చినా.. ఏ రోజు నాగార్జున పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు తాజాగా బంగార్రాజు మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ విడాకుల అంశంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు నాగార్జున. ‘బాలీవుడ్ లైఫ్’ కథనం ప్రకారం నాగ్ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులు కోరుకుంది మొదట సమంతనే అని ఓపెనప్ అయ్యాడు నాగార్జున. గతేడాది (2021) న్యూ ఇయర్ వేడుకలు ఇద్దరూ కలిసి సంతోషంగా నిర్వహించుకున్నారని చెప్పిన నాగ్.. ఆ తర్వాతే వాళ్లిద్దరి మధ్య ఏదో సమస్య వచ్చిందని, కాకపోతే కచ్చితంగా ఏంటనేది తనకు మాత్రం తెలియదని తెలిపారు.

విడాకుల సమయంలో చైతు చాల బాధ పడ్డాడని, నాకు విషయం తెలిస్తే ఏంటని, కుటుంబ పరువు ఏమవుతుందో అని ఎన్నో అంశాల్లో నాగ చైతన్య కంగారు పడ్డాడని తెలిపాడు నాగార్జున. “విడాకుల అంశంలో నాగ చైతన్య ఆమె నిర్ణయాన్ని అంగీకరించాడు. కానీ నా గురించి చాలా ఆందోళన చెందాడు. నేను ఏమి ఆలోచిస్తానో.. కుటుంబం యొక్క ప్రతిష్ట ఏమౌతుందో అని ఆలోచించాడు” అని చైతు గురించి నాగ్ తెలిపాడు. ”నేను కంగారుపడతాను అనుకోని చైతన్య నన్ను చాలా ఓదార్చాడు. వీళ్లిద్దరూ మ్యారేజ్ లైఫ్ లో 4 ఏళ్లు కలిసి ఉన్నారు. కానీ వాళ్ల మధ్య ఎలాంటి సమస్య రాలేదు. ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నారు. ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో నాకు తెలియదు. 2021 న్యూ ఇయర్ ని కూడా ఇద్దరూ కలిసి జరుపుకున్నారు. ఆ తర్వాత సమస్యలు తలెత్తినట్లు అనిపిస్తుంది” అని నాగ్ వెల్లడించినట్లు బాలీవుడ్ లైఫ్ పేర్కొంది. ఏదేమైనా చైసామ్ డివోర్స్ ప్రకటన వచ్చి నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ ఈ ఇష్యూ చర్చల్లో నిలుస్తుండడం విశేషం.