సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతించిన కిసాన్ ఏక్తా మోర్చా

cm kcr announced compensation to farmers

మోడీ సర్కారు తెచ్చిన వివాదస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన కిసాన్ ఆందోళనలో సుమారు 700 మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారు. రైతుల పోరాటాలకు దిగొచ్చిన మోడీ.. క్షమాపణలు చెబుతూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వివాదస్పద మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

రైతులకు సంఘీభావం తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్.. మరణించిన రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రతి రైతు కుటుంబానికి రూ.3 లక్షల పరిహారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటనపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూనే మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.

సీఎం కేసీఆర్ ప్రకటనపై సంయుక్త కిసాన్ ఏక్తా మోర్చా స్పందించింది. రైతుల త్యాగాలను మోడీ సర్కారు పట్టింకున్న పాపాన పోలేదని, అలాంటిది సీఎం కేసీఆర్ స్పందించి రైతు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు  తెలియజేశారు.

మరణించిన ప్రతి రైతు కుటుంబానికి భారత ప్రభుత్వం రూ. 25 లక్షలు చెల్లించాలని, అన్ని కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేయటాన్ని కిసాన్ ఏక్తా మోర్చా నాయకులు స్వాగతించారు. మోడీ సర్కారు రైతులకు పరిహారం అందియ్యాలని, వారిపై అకారణంగా పెట్టిన కేసులను తొలగించాలని కిసాన్ మోర్చా కేంద్రాన్ని డిమాండ్ చేసింది.

అమరవీరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రకటించిన ఈ ఎక్స్ గ్రేషియా కోసం తెలంగాణ ప్రభుత్వానికి 700 మంది రైతు అమరవీరుల జాబితాను అందజేస్తామని కిసాన్ ఏక్తా మోర్చా తెలిపింది.