కేకేఆర్ టార్గెట్ 136.. 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ - TNews Telugu

కేకేఆర్ టార్గెట్ 136.. 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ఫైనల్ క్వాలిఫయర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మొదటి నుంచి జోరు మీదున్న ఢిల్లీ ఆటగాళ్లు కీలకమైన మ్యాచులో రాణించలేకపోయారు. ఓపెనర్లుగా బ్యాటింగ్ కి వచ్చిన పృథ్వీ షా 12 బంతుల్లో 18 పరుగులు చేసి వేగం పెంచే ప్రయత్నంలో చక్రవర్తికి ఎల్బీడబ్ల్యూ రూపంలో దొరికి పోయాడు. శిఖర్ ధావన్ కూడా స్లోగా ఆడుతూ.. 39 బాల్స్ ఆడి.. 1 ఫోర్, 2 సిక్సులతో 36 పరుగులు చేశాడు.

ఆ తర్వాత వచ్చిన స్టోనిస్ 23 బంతుల్లో 18 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 27 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 30 రన్స్ చేసి స్కోరు బోర్డు వేగం పెంచే ప్రయత్నం చేశాడు. కానీ.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ స్పీడు పెంచకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. కలకత్తా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెటలు తీసుకోగా.. శివమ్ మావి, ఫెర్గుసన్ చెరో వికెట్ తీసుకున్నారు.

Tags:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,