కేఎల్ రాహుల్ రేర్ రికార్డ్.. ఒక్క సిక్స్ తో అదరగొట్టేశాడు - TNews Telugu

కేఎల్ రాహుల్ రేర్ రికార్డ్.. ఒక్క సిక్స్ తో అదరగొట్టేశాడుదుబాయ్ లో జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రేర్ రికార్డు సాధించాడు. ఐపీఎల్ లో అత్యంత స్పీడుగా 3ల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రాహుల్ రేర్ ఫీట్ సాధించాడు. 80 ఇన్నింగ్స్ ఆడి 3వేల పరుగులు చేసిన రాహుల్.. ఈ గ్రేట్ రికార్డు సాధించిన రెండో బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్ లో సకారియా వేసిన మూడో బంతికి సిక్స్ కొట్టి రాహుల్ ఈ రికార్డును తన పేరున రాసుకున్నాడు.

KL Rahul Rare Record In IPL History
KL Rahul Rare Record In IPL History

అంతేకాదు మయాంక్‌ అగర్వాల్‌ కూడా 3వేల పరుగుల జాబితాలో చేరిపోయాడు. ఇదే మ్యాచ్‌లో క్రిస్‌ మోరిస్‌ వేసిన 10వ ఓవర్‌ మూడో బంతిని సిక్స్‌ బాదిన మయాంక్‌ ఐపీఎల్‌లో ఈ మార్క్ దాటేశాడు. ఇప్పటి వరకు 75 ఇన్నింగ్స్ లో క్రిస్‌ గేల్‌ 3వేల పరుగుల మార్కును అందుకొని మొదటి స్థానంలో నిలిచాడు. డేవిడ్‌ వార్నర్‌ 94 ఇన్నింగ్స్, సురేశ్‌ రైనా 103 ఇన్నింగ్స్ లో 3వేల పరుగుల క్లబ్ లో చేరారు.