జూనియర్ ఎన్టీఆర్ చెబితే వినాలా: కొడాలి నాని

kodali nani comments on jr NTR

ఏపీలో రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. చంద్రబాబు మీడియాతో మాట్లాడిన మాటలకు వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. చంద్రబాబును పిచ్చాసుపత్రిలో జాయిన్‌ చేసే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు.

తాజాగా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు చేసింది మానవ తప్పిదమన్నాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను అనేక ఇబ్బందులు పెట్టాడని గుర్తు చేశారు. తన భార్యను అనవసరంగా రాజకీయాల్లోకి లాక్కొచ్చి అల్లరి చేసుకుంటున్న పచ్చి రాజకీయ వ్యభిచారి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు తన భార్యను అతను అల్లరి చేసుకుంటూ ఉంటే.. నేను క్షమాపణ చెప్పమంటాడేమిటని ఆయన ప్రశ్నించారు. నేను సెక్యూరిటీ పెంచుకోవడం లేదంటూనే.. నేను సెక్యూరిటీని వదిలేస్తా.. చంద్రబాబు జడ్ ప్లస్ వదిలేయమనండని సవాల్ చేసిండు.

జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడం ఏమిటి? చంద్రబాబు శిష్యులు మాట్లాడే మాటలను ఆయన కంట్రోల్ చేశారా? అని నాని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ చెబితే మేము వినాలా..? అంటూ ఓ సందర్భంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

నందమూరి ఎన్టీఆర్ కుటుంబం అంటే ముఖ్యమంత్రి జగన్ కి కూడా గౌరవం ఉంటుందన్నారు. వాళ్లు అమాయకులని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆ పార్టీ నాశనం అవుద్దని చంద్రబాబు చెప్పినా విన్నారని, గొర్రె కసాయి వాడినే నమ్ముతుందన్నారు. చంద్రబాబు ఏది చెప్పినా నమ్మేస్తారంటూ నందమూరి కుటుంబాన్నిఉద్దేశించి మంత్రి కొడాలి నాని అన్నారు.