కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ లీటర్ ధర ఎంతో తెలుసా.. ఆ వాటర్ కి అంత కాస్ట్ ఎందుకో?

Kohli Drinking Black Water only
Kohli Drinking Black Water only

టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ ఫిట్ నెస్ గురించి అందరికీ తెలిసిందే. బాడీ ఫిట్ నెస్ కోసం నిత్యం వర్కవుట్లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటారు. ఇక డైట్ విషయానికొస్తే.. తినే ఫుడ్ తో పాటు.. తాగే వాటర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందరిలా మామూలు వాటర్ అస్సలు తాగడు. అయితే ఏ వాటర్ తాగుతాడు..? మినరల్ వాటర్ మాత్రమే తాగుతాడా? అనుకుంటున్నారా? విరాట్ కేవలం బ్లాక్ వాటర్ మాత్రమే తాగుతాడు. కొహ్లీ తాగే బ్లాక్ వాటర్ లీటర్ ధర రూ.3000-4000 ఉంటుంది. ఈ వాటర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతాయి. కరోనా ప్రారంభం నుంచే కొహ్లీ బ్లాక్ వాటర్ తాగడం మొదలు పెట్టాడు.

Kohli Drinking Black Water  only
Kohli Drinking Black Water only

బ్లాక్ వాటర్ కి అంత ధరెందుకు.. ఉపయోగాలేంటి?
బ్లాక్‌ వాటర్‌లో సహజసిద్ధమైన అల్కలైన్‌ ఉంటుంది. ఇవి బాడీని హైడ్రేటెడ్‌ గా, ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి.. వ్యాధులను తరిమి కొడుతుంది. ఇందులో ఉండే 70 శాతం ఖనిజాలు జీర్ణప్రక్రియ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మనం నిత్యం తాగే నీరులో pH స్థాయి 7 మాత్రమే ఉంటే.. బ్లాక్‌ వాటర్‌లో 7 కంటే ఎక్కువ ఉంటుంది. అందుకే ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. చర్మం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతుంది. గుజరాత్‌లోని వడోదరలోని ఏవీ ఆర్గానిక్స్‌ అనే అంకుర సంస్థ ‘‘ ఎవోకస్‌’’ పేరుతో బ్లాక్‌వాటర్‌ తయారు చేస్తోంది.