ఎంపైర్ తో కోహ్లీ వాగ్వాదం.. కెప్టెన్ గా ఆడుతున్న చివరి మ్యాచ్ లో కోహ్లీ హల్ చల్

ఐపీఎల్ లో ఆర్సీబీ కెప్టెన్ గా చివరి మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ మ్యాచ్ మధ్యలో ఎంపైర్ తీరుపై ఫైర్ అయ్యాడు.  ఈ సారి కప్ కొట్టి కోహ్లీకి గిఫ్ట్ గా ఇవ్వాలని ఆర్సీబీ గట్టిగా ట్రై చేస్తోంది. కాగా.. ఈరోజు జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ.. కలకత్తాతో తలబడుతోంది. 20 ఓవర్ల మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి 138 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు కేకేఆర్ మీద బౌలింగ్ తో దాడికి దిగింది

 

 

చాహల్ ఏడో ఓవర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆఖరి బంతిని పుల్ చేయబోయి త్రిపాఠి మిస్ అయ్యాడు. దీంతో బాల్ ప్యాడ్ ని తాకింది. చాహల్ ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేశాడు. ఎంపైర్ వీరేందర్ శర్మ దాన్ని నాటౌట్ గా ఇచ్చాడు. దీంతో కోహ్లీ రివ్యూ కోరాడు. అల్ట్రా ఎడ్జ్ లో బంతి మొదట ప్యాడ్లను తాకి.. నేరుగా లెగ్ స్టంప్ ను ఎగరగొట్టినట్టు క్లియర్ గా కనిపించింది. దీంతో త్రిపాఠి ఔట్ అని తేలింది. దీంతో ఆ ఓవర్ ముగిసిన తర్వాత కోహ్లీ ఎంపైర్ వీరేందర్ శర్మ దగ్గరకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య సీరియస్ గా వాగ్వాదం నడిచింది. ఆ తర్వాత కోహ్లీ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.