జాతీయ గీతాలాపన సమయంలో కోహ్లి అనుచిత ప్రవర్తన.. మండిపడుతున్న అభిమానులు

Virat Kohli

సౌతాఫ్రికాతో మూడో వన్డేకి ముందు భారత జాతీయ గీతాలాపన సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేసిన అనుచిత పనికి భారత అభిమానులు తీవ్రంగా హర్ట్‌ అవుతున్నారు.

దేశం పట్ల అమితమైన గౌరవం కలిగిన కోహ్లి.. జాతీయ గీతాలాపన సమయంలో చూయింగ్‌ గమ్‌ నములుతూ ఉదాసీనంగా కనిపించడంతో భారతీయులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

జాతీయ గీతం ఆలపించేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి కదా అంటూ అభిమానులు, నెటిజన్లు కోహ్లీపై ఫైరవుతున్నారు. కోహ్లి నుంచి ఇలాంటి అనుచిత ప్రవర్తన ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు.