ఇద్దరిలో బ్యాటింగ్ మొనగాడెవరు?

kohli vs azam batting statitics
kohli vs azam batting statitics
kohli vs azam batting statitics
kohli vs azam batting statitics

ఏ వరల్డ్ కప్ అయినా.. భారత్ – పాక్ మ్యాచ్ కి ఉన్నంత క్రేజ్.. డిమాండ్ వేరే మ్యాచ్ కి ఉండదు. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారు. ఎవరు బాగా ఆడతారు? ఎవరు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారు అని చర్చ వారం ముందుగానే స్టార్ట్ అవుతుంది. అయితే.. చాలా గ్యాప్ తర్వాత టీ10 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు భారత్ – పాకిస్తాన్ జట్లు ఈ రోజు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశాన్ని భారత్ కే ఇచ్చింది. అయితే.. రెండు జట్ల కెప్టెన్స్ అయిన విరాట్ కొహ్లీకి పాకిస్థాన్ మీద ఓ రికార్డుంది. అదేంటంటే.. ఇప్పటి వరకు వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్లు ఒక్కసారి కూడా ఔట్ చేయలేకపోయారు. మరోవైపు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా పాక్ బ్యాటింగ్ కూడా ఆ జట్టుకు బలం.


భారత్ నుంచి కోహ్లీ.. పాక్ నుంచి ఆజమ్ మీద వారి బ్యాటింగ్ మీదే అందరి దృష్టి ఉంది. బాబర్ ఆజమ్‌ను పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు తమ దేశపు విరాట్ కోహ్లీగా పిలుచుకుంటుంటారు. వరల్డ్ క్రికెట్ లో ఈ ఇద్దరికీ మాస్ మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఇద్దరి బ్యాటింగ్ శైలిని, దూకుడు ఆకట్టుకుంటుంది. ఈ ఇద్దరిలో బ్యాటింగ్ కింగ్ ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది.


విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ ఇద్దరూ మంచి దూకుడు మీద ఉన్న బ్యాటర్లే. వన్డే , టీ20, టెస్ట్ ఫార్మట్‌లో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 50కి పైగా ఉంటోంది. బాబర్ ఆజమ్ 40పైనే యావరేజ్‌ రికార్డు చేశాడు. దశాబ్దకాలంగా విరాట్ కోహ్లీ మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్‌మెన్‌గా సత్తా చాటుతున్నాడు. మూడు ఫార్మట్ల క్రికెట్‌లో విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో కోహ్లీ యావరేజ్ 59.07గా ఉంటోంది. అతను చేసిన మొత్తం పరుగులు 12,169. టెస్టు మ్యాచుల్లో అతని బ్యాటింగ్ సగటు 51.08. చేసిన పరుగులు 7,765. టీ20 ఇంటర్నేషనల్స్ ఫార్మట్‌లోనూ అదే స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నాడు విరాట్ కోహ్లీ. అతని బ్యాటింగ్ యావరేజ్ 52.65గా నమోదైంది. చేసిన పరుగులు 3,159. కోహ్లీ బ్యాటింగ్ ఎంత స్థిరంగా సాగుతోందో చెప్తున్నాయి.


పాకిస్తాన్ జట్టు కెప్టెన్, ఓపెనర్ బాబర్ ఆజమ్ గణాంకాలు కూడా బాగానే ఉన్నాయి. వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఇప్పటిదాకా 3,985 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 56.92. టెస్ట్ ఫార్మట్‌లో అతని యావరేజ్ 42.94గా ఉంటోంది. చేసిన పరుగులు 2,326. టీ20 ఇంటర్నేషనల్స్‌లో బాబర్ బ్యాటింగ్ సగటు 46.89గా రికార్డయింది. ఇప్పటిదాకా అతను 2,204 పరుగులు చేశాడు. కొద్దిపాటి తేడాతో ఇద్దరి బ్యాటింగ్ యావరేజ్ దాదాపు సమానంగా సాగుతోంది. నిలకడ కనిపిస్తోంది.
బాబర్ ఆజమ్ ఈ ఏడాది టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 17 టీ20 మ్యాచ్‌లను ఆడి.. 523 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 122 పరుగులు. 50కి పైగా నాలుగుసార్లు పరుగులు సాధించాడు. మిగిలిన మ్యాచుల్లో 30 ప్లస్ స్కోరును సాధిస్తూ వచ్చాడు. పాకిస్తాన్‌కే చెందిన మరో ఓపెనర్ రిజ్వాన్ కూడా దూకుడు మీద ఉన్నాడు. ఈ ఏడాది ఏడు మ్యాచులను ఆడాడు. ఒక సెంచరీ.. ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అత్యధిక స్కోరు 115 పరుగులు నాటౌట్.