ముగిసిన కోల్‌కతా ఇన్నింగ్స్.. హైదరాబాద్‌ టార్గెట్ ఎంతంటే?

సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఆండ్రూ రస్సెల్‌ (49 నాటౌట్), సామ్‌ బిల్లింగ్స్‌ (34),  అజింక్య రహానె (28), నితీశ్‌ రాణా (26) రాణించడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

హైదరాబాద్‌కు 178 పరుగులను లక్ష్యాన్ని నిర్దేశించింది. వాషింగ్టన్ సుందర్‌ వేసిన చివరి ఓవర్‌లో రస్సెల్‌ మూడు సిక్సర్లు బాదడం విశేషం. వెంకటేశ్‌ అయ్యర్ 7, శ్రేయస్‌ అయ్యర్ 15, రింకు సింగ్‌ 5 పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్ 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్‌సెన్, నటరాజన్‌ తలో వికెట్ తీశారు.