ఢిల్లీని ఇంటికి పంపిన కలకత్తా.. చెన్నైతో ఫైనల్ పోరుకు సిద్ధం

ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటర్లు ఇరగదీశారు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఒక బాల్ మిగిలి ఉండగానే ఊదేసింది. ఈ మ్యాచ్ గెలుపుతో కేకేఆర్ ఐపీఎల్ ఫైనల్ కి చేరింది. చివరి బంతికి సిక్స్ కొట్టిన రాహుల్ త్రిపాఠి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు.


ఓపెనర్​ వెంకటేశ్​ అయ్యర్​ 41 బంతుల్లో 4 ఫఓర్లు, 3 సిక్సులతో 55 పరుగులు చేసి.. ఢిల్లీకి ఓటమి తప్పదని హెచ్చరికలు జారీ చేయగా.. ఆ తర్వాత వచ్చిన నితిష్ రాణా.. 13 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుసగా.. ఐదుగురు కలకత్తా బ్యాటర్లు డకౌట్ కావడంతో కేకేఆర్ పని అయిపోయింది.. ఓటమి తప్పదని భావించారు. కాగా.. చివరి బంతికి సిక్స్ కొట్టిన రాహుల్ త్రిపాఠి ఉత్కంఠభరిత మ్యాచ్ ని కేకేఆర్ వైపు తిప్పాడు. దీంతో కేకేఆర్ ఢిల్లీ మీద 3 వికెట్లు తేడాతో​ గెలుపొందింది. ఈ విజయంతో మోర్గాన్​ సేన ఐపీఎల్​ ఫైనల్​కు చేరింది. అక్టోబరు 15న జరగనున్న ఫైనల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టుతో కలకత్తా నైట్ రైడర్స్ తలపడనుంది.