ఆర్సీబీ ఇచ్చిన టార్గెట్ ను ఊది పారేసిన కేకేఆర్.. చూస్తుండగానే విజయాన్ని ముద్దాడారు - TNews Telugu

ఆర్సీబీ ఇచ్చిన టార్గెట్ ను ఊది పారేసిన కేకేఆర్.. చూస్తుండగానే విజయాన్ని ముద్దాడారుKolkata Night Riders Won By ( Wickets
Kolkata Night Riders Won By ( Wickets

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి ఆది నుంచి అడుగు తడబడింది. 20 ఓవర్లు కూడా పూర్తిగ ఆడలేకపోయిన కోహ్లీ సేన 19 ఓవర్లకు ఆలౌట్ అయి కలకత్తా నైట్ రైడర్స్ కి 92 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే.. ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన కలకత్తా నైట్ రైడర్స్ బ్యాట్ మెన్స్ తొలి నుంచే దూకుడుగా ఆడి ఐదు ఓవర్లు ముగిసే సరికి 45 పరుగులు చేసి విజయం సులువే అనిపించారు.

Kolkata Night Riders Won By ( Wickets
Kolkata Night Riders Won By ( Wickets

శుభ్ మన్ గిల్, వెంకటేశ్ దూకుడుగా ఆడి జట్టును విజయ తీరాల్లోకి చేర్చారు. మరికొద్దిసేపట్లో మ్యాచ్ విన్ అవుతుందన్న క్షణంలో శుభ్ మన్ గిల్ అవుట్ అయ్యాడు. రెండో వికెట్ గా బ్యాటింగ్ కు వచ్చిన రస్సెల్ వెంకటేశ్ కి స్ట్రైక్ ఇచ్చాడు. పదకొండో ఓవర్లో తొలి బంతికే శుభ్ మన్ గిల్ అవుటవగా.. రెండో బంతి వృథా అయింది. మూడో బంతిని వెంకటేశ్ ఫోర్ గా మలిచాడు. నాలుగో బంతిని ఆపాడు. ఆ తర్వాత చాహల్ వేసిన రెండు బంతులను ఫోర్లుగా మలిచిన వెంకటేశ్ పది ఓవర్లు ముగిసేసరికి 94 పరుగులు సాధించి సునాయస గెలుపును ఖాతాలో కేకేఆర్ కి అందించాడు. ఫలితంగా 10 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ ఒక్క వికెట్ కోల్పోయి 94 పరుగులు చేసి విజయ బావుటా ఎగురవేసింది.