
ఎలిమినేటర్ మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచి బెంగళూరును ఇంటికి పంపారు. రాయల్ ఛాలెంజర్స్ ను 139 పరుగుల తక్కువ లక్ష్యానికే ఆలౌట్ చేసి ఛేజింగ్ కి దిగిన బెంగళూరు 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. మ్యాచ్ చేజారడంతో రాయల్ ఛాలెంజర్స్ ఇంటి దారి పట్టింది. కోల్కతా ఓపెనర్లు శుభ్మన్ గిల్ (29), వెంకటేశ్ అయ్యర్ (26) శుభారంభం చేశారు. నితీశ్ రాణా (23), సునీల్ నరైన్ (25) రాణించి.. కేకేఆర్ ను గెలిపించారు. నరైన్ అటు బంతితో.. ఇటు బ్యాట్ తో మ్యాజిక్ చేశాడు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ , యుజువేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు తీశారు.