చిరంజీవి లేకపోతే నువ్వుండేవాడివా… మరోసారి రెచ్చిపోయిన కోట

kota srinivas rao Sensational Comments On Naga Babu
kota srinivas rao Sensational Comments On Naga Babu
kota srinivas rao Sensational Comments On Naga Babu
kota srinivas rao Sensational Comments On Naga Babu

సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో ఆయన మాటలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. మా ఎన్నికల సమయంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ వేడి రాజేస్తున్నాయి. మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తాను ప్రకాష్ రాజ్ తో 15 సినిమాలకు పైగా నటించాము. కానీ.. ఒక్కసారి కూడా ప్రకాష్ రాజ్ షూటింగ్ కి టైమ్ కి రాలేదు. అలాంటి వాడు మా అధ్యక్షుడిగా గెలిచి ఏం చేస్తాడు అంటూ కోట చేసిన కామెంట్లు తీవ్ర దుమారం సృష్టించి.. చివరికి ప్రకాష్ రాజ్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యాయి. కాగా.. తాజాగా యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ మీద కామెంట్లు చేసిన కోట.. మెగా బ్రదర్ నాగబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల మీద స్పందించిన నాగబాబు.. రేపో మాపో పోయే కోట ఇంకెప్పుడు మారతాడు? అంటూ తీవ్రంగానే మాట్లాడాడు. నాగబాబు వ్యాఖ్యల పట్ల ఇండస్ట్రీలో కూడా కొంతమంది తప్పుబట్టారు.

kota srinivas rao Sensational Comments On Naga Babu
kota srinivas rao Sensational Comments On Naga Babu

నాగబాబు వ్యాఖ్యల మీద కోట అప్పుడు స్పందించలేదు. కానీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన నాగబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్ప నాగబాబుకు ఏముంది? చిరంజీవి, పవన్ కల్యాణ్ లేకపోతే ఆయనను ఎవరూ పట్టించుకోరు అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాగబాబులా తాను కూడా నోరు జారి ఉంటే.. పెద్ద చర్చ అయ్యేదని.. అనవసరంగా దాని గురించి మాట్లాడానని అన్నారు కోట. తాజాగా నాగబాబుపై చేసిన కోట చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు యాంకర్ అనసూయ మీద చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. దీనికి అనసూయ కూడా ఘాటుగానే స్పందించింది.