ఎవరో అనసూయ అంట.. ఆమెవరో నాకు తెలీదు.. గాలి తీసేసిన కోట..!

కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు శైలి. ఇండస్ట్రీలో ఎంతటి వారినైనా విమర్శించే ముక్కుసూటి మనిషిగా కోటకి పేరుంది. తాజాగా మా ఎన్నికలంటూ సినీ తారలు చేస్తున్న రచ్చపై ఫైర్ అయ్యాడు కోట. ఎలక్షన్స్ పేరుమీద మీడియాకి ఎక్కి మన పరువు మనం తీసుకోవద్దని, ప్రజలకి మా ఎన్నికలతో సంబంధం లేదని న్యాయబద్ధమైన విమర్శలు చేస్తున్నాడు. కానీ ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి బూతులు తిట్టుకుంటూ ప్రజల్లో ‘మా’ అంటేనే అసహ్యం కలిగేలా చేసుకున్నారు. ముఖ్యంగా మంచు విష్ణు భాష, శైలిపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.
మా ఎలెక్షన్స్ లో లోకల్ నాన్ లోకల్ అంశం తెరమీదకి తీసుకురావటంతో ఒక్కసారిగా పరిణామాలు హీటెక్కాయి. ప్రకాష్ రాజ్ తెలుగువాడు కాదంటూ.. మంచు విష్ణు వచ్చిరాని తెలుగులో కామెంట్స్ చేస్తున్నాడని నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఒంటరైన ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ గా నాగబాబు రంగంలోకి దిగాడు. మా అధ్యక్షుడు కావాలంటే తెలుగువాడు అయ్యి ఉండాలని రూల్ ఉందా.. ఆ మాటకి వస్తే తెలంగాణాలో ఉంటున్న మనమంతా నాన్ లోకల్ అవుతాం అని కౌంటర్ ఇచ్చాడు. ఇక విష్ణుకి సపోర్ట్ చేస్తున్న కోటపై కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. ప్రకాష్ రాజ్ అంటే ఆయనకీ ఎందుకంత అసూయ అంటూ నాగబాబు హాట్ కామెంట్స్ చేయటంతో కోట మీడియాకి ఎక్కి మా ఎన్నికల తీరుపై, ప్రకాష్ రాజ్ పై మండి పడ్డాడు.

‘నేను మంచు విష్ణు ప్యానెల్ కి మాత్రమే సప్పోర్ట్ చేయటం లేదు. ఇరు వైపులా ఉన్న సభ్యులకి కూడా మద్దత్తిస్తున్న. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో నాకు తెలిసిన వారికి సపోర్ట్ ఇస్తున్నాను. నాకు ఆ ప్యానల్ అందరు తెలియదు. నాకు తెలియని వాళ్లు ఎవరంటే.. అనసూయ అని ఎవరో కొత్తగా వచ్చారట.. ఆమె పేరు వినిపిస్తుంది. ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమెతో పాటు ఇద్దరు ముగ్గురు తెలియని వాళ్లు ఉన్నారు అంటూ అనసూయ గాలి తీసేశాడు సీనియర్ యాక్టర్.            ఇక మా ఎన్నికల్లో పోటీ చేయాలంటే అర్హత ఉండాలని అన్నారు కోట. నేను ప్రకాష్ రాజ్ ప్యానెల్ వారిలోని అందరికి ఒక డైరెక్ట్ ప్రశ్న అడుగుతున్న. ప్రకాష్ రాజ్ ఎప్పుడైనా షూటింగ్ కి టైంకి వచ్చాడా.. సెట్ లో ఎప్పుడైనా గొడవపడకుండా అనుకువగా ఉన్నాడా.. ఏనాడైనా మా సభ్యులకి సహాయం చేశాడా.. నేను ఇప్పటివరకు ఎందరినో ఆదుకున్న. 4లక్షల వరకు ఖర్చుపెట్ట. ఆయన తెలుగు ఆర్టిస్టుల కోసం ఒక్కపైసా అయినా తీశాడా. ఆయన జాతీయ స్థాయి నటుడు కావొచ్చు. కానీ ‘మా’ లో ఎవ్వరు గొప్ప కాదు. అందరు సమానమే. ఇప్పటివరకు ఒక్క మా మీటింగ్ కూడా హాజరవ్వకుండానే.. నాకు తెలంగాణ ముఖ్యమంతి తెలుసు అదీ ఇదీ అంటున్నాడు. నా కంటే కేసీఆర్ గారు ఎక్కువ తెలుసా ఆయనకీ. నేను కేసీఆర్ గారు కలిసి పనిచేశాం. ఆయనకి ఏం తెలుసు. మాట్లాడితే మైక్‌ల ముందు రావడం ఎందుకు? కూర్చుని మాట్లాడుకుంటే సరిపోదా అంటూ ఏకిపడేశాడు కోట శ్రీనివాస్ రావు.