శ్రీలంకలో ఉన్న టీమిండియాలో కలకలం..కృనాల్ పాండ్యాకు కరోనా - TNews Telugu

శ్రీలంకలో ఉన్న టీమిండియాలో కలకలం..కృనాల్ పాండ్యాకు కరోనాశ్రీలంక టూర్ లో ఉన్న ఇండియన్ టీమ్ లో కరోనా కలకలం రేగింది. టీమ్ మెంబర్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకింది. దీంతో రెండు టీమ్ లను ఐసోలేషన్ లో ఉంచారు. మంగళవారం జరగాల్సిన టీ 20 ని కూడా వాయిదా వేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కృనాల్ పాండ్యా వైరస్ బారిన పడటంతో ఆటగాళ్లలో ఆందోళన మొదలైంది. అందరూ ప్లేయర్స్ శాంపిల్స్ ను తీసుకున్నారు. వాళ్లకు నెగిటివ్ అని తేలితేనే బుధవారం రెండో టీ 20 ని నిర్వహించనున్నారు. ఆదివారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో కృనాల్ ప్యాండ్యా రెండు ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. రెండు టీమ్ మెంబర్స్ ను కృనాల్ పాండ్యా కలిశాడు. ఐతే పృథ్వీ షా, సూర్య కుమార్ యాదవ్ లు ఇంగ్లాండ్ లో ఉన్న టీమ్ తో కలిసేందుకు వెళ్లారు. ఇప్పటికే కృనాల్ తో వీళ్లు కలవటంతో వాళ్లను ఐసోలేషన్ లో ఉంచనున్నారు.