పెద్ద మనసు చాటుకున్న కేటీఆర్.. చూడగల్గుతున్న చిన్నారి

KTR expresses generosity to a child

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆపదలో ఉండే వారికి అండగా నిలిచే కేటీఆర్.. డబుల్ విజన్ సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆపరేషన్ అయ్యేందుకు అండగా నిలిచి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.

డబుల్ విజన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆ 11 సంవత్సరాల చిన్నారికి ఆపరేషన్ పూర్తయింది. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ‘సంతోషం.. పాప ఇప్పుడు చూడగల్గుతుంది’ అని కామెంట్ పెట్టారు.

డబుల్ విజన్ సమస్యతో బాధపడుతున్న ఆ చిన్నారికి ప్రతిదీ రెండుగా కన్పిస్తుంది. ఆపరేషన్ కు 40 వేల రూపాయలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ సమస్యను ట్విట్టర్ వేదికగా వివరించారు.

వెంటనే స్పందించిన కేటీఆర్.. చిన్నారి ఆపరేషన్ కు అవసరమైన సాయం చేయాలని తన సిబ్బందిని ఆదేశించారు. పాపకు ఆపరేషన్ చేయించి వెలుగులు ప్రసాదించిన కేటీఆర్ కు ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలియజేశారు.