మంత్రి కే తారకరామారావు యూకే పర్యటన రెండో రోజు కొనసాగుతున్నది. ఈరోజు తన పర్యటనలో భాగంగా పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. థామస్ లాయిడ్ గ్రూప్ ఎండి నందిత సెహగల్ తుల్లీ, సీనియర్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ లో కొనసాగుతున్న తమ కంపెనీ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు.
టాస్క్ తో పియర్సన్ భాగస్వామ్యం
పియర్సన్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి కేటీఆర్, తెలంగాణలో నైపుణ్య శిక్షణ అభివృద్ధికి సంబంధించి చేపట్టిన పలు కార్యక్రమాల పైన వివరాలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్ తో పని చేసేందుకు రియల్ సంస్థ ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తో భాగస్వామ్యానికి ముందుకు వచ్చిన పియర్సన్ సంస్థకి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్ వారిని తెలంగాణకి ఆహ్వానించారు.
Minister @KTRTRS met with Mr. Franck Riot, Global R&D Head GSK Consumer Health today & discussed the growth witnessed by the safety & regulatory set up of the company in Telangana, their plans for the state as they become Haleon in mid-2022” @Haleon_health @gsk_consumer_in pic.twitter.com/Wr6gZUQFCg
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2022
ఏరోనాటికల్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చలు
క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ హాల్ఫార్డ్, ప్రో వైస్ ఛాన్స్లర్ పోల్లార్డ్ లు మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏరోనాటికల్ యూనివర్సిటీ ప్రయత్నాల పట్ల తాము ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ స్థాయి ఏరోనాటికల్ యూనివర్సిటీ తెలంగాణ కేంద్రంగా తీసుకువచ్చే తమ ప్రయత్నంలో కలిసి రావాలని ఈ సందర్భంగా కేటీఆర్ క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ బృందానికి విజ్ఞప్తి చేశారు.
Noted British Indian Businessman and President of the Confederation of British Industry @Lord_Bilimoria hosted Telangana IT & Industries Minister @KTRTRS at the UK Parliament. Minister later interacted with MPs, representatives of CII & CBI, & Indo-British APPG. pic.twitter.com/HnC8Gi01v2
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2022
HSBC విస్తరణ కార్యాచరణ
హెచ్ఎస్బీసీ (HSBC) కి చెందిన పాల్ మెక్ పియార్సన్, బ్రాడ్ హిల్ బర్న్ లు మంత్రి కే తారకరామారావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఇప్పటికే తమకు బలమైన ప్రెజెన్స్ (presence) ఉన్నదని తెలిపారు. తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకు సంబంధించి త్వరలోనే స్పష్టమైన కార్యాచరణతో మరోసారి సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
In the 3rd round table meeting organized by @UKIBC & @SMMT in London, Minister @KTRTRS interacted with automobile industry leaders & pitched the state as a investment destination. Minister stated that Telangana is one of the front runners in the EV revolution. pic.twitter.com/VLxmhofN3K
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2022
తెలంగాణలో విస్తరణ అవకాశాలపై ‘గ్లాక్సో’తో చర్చ
హైదరాబాద్ ఫార్మాలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గ్లాక్సో స్మిత్ క్లైవ్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్(R&D) హెడ్ ఫ్రాంక్ రాయట్ తో మంత్రి కే.తారకరామారావు లండన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ విస్తరణ ప్రణాళికలు, ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న తమ విభాగాల పురోగతిని మంత్రి కేటీఆర్ కు ఫ్రాంక్ రాయట్ వివరించారు. జిఎస్కే నుంచి“హాలియన్” పేరుతో కన్స్యూమర్ హెల్త్ కేర్ విభాగం విడిపోయి స్వతంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. తమ కంపెనీ వ్యూహాల్లో హైదరాబాద్ కు ఎల్లప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో రూ. 710 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని, 125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. గత రెండు సంవత్సరాల్లోనే దాదాపు 340 కోట్ల రూపాయలను హైదరాబాద్ ఫార్మాలో పెట్టుబడిగా పెట్టామన్నారు. హైదరాబాద్ లోని తమ సేఫ్టీ , రెగ్యులేటరీ (safety and regulatory set up) విభాగం ద్వారా విస్తరణ అవకాశాలను మరింత పెంచుకుంటామని ఫ్రాంక్ రాయట్ తెలిపారు. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గ్లాక్సో స్మిత్ క్లైవ్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. తమ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారలు అందిస్తామన్నారు.