దట్ ఈజ్ కేటీఆర్.. ఎలన్‌ మస్క్‌ ట్వీట్ పై.. బాలీవుడ్ టు టాలీవుడ్ ఫిదా..!

KTR Tweet About Elon Musk Is Going Viral In Country
KTR Tweet To Elon Musk Is Going Viral In Country

తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్‌కు ఆహ్వానం పంపుతూ పెట్టిన ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌కు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందంటూ కేటీఆర్ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ని ఇండియాలో టెస్లా ఎప్పుడు వస్తుందని ఓ నెటిజన్ ప్రశ్న అడిగితే.. ఎలాన్ సమాధానం ఇండియాలో హాట్ టాపిక్ అయ్యింది. భారత ప్రభుత్వ పెడుతున్న పలు ఇబ్బందులతో పోరాడుతున్నామని ఎలాన్ మస్క్ ఆ నెటిజన్ కి సమాధానమిచ్చాడు. దీంతో తెలంగాణాలో ఉద్యోగాలు,పెట్టుబడుల కోసమే నిత్యం పరితపించే మంత్రి కేటీఆర్ వెంటనే టెస్లాకు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై దేశం నలువైపులా నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రముఖ జర్నలిస్టులు, ఎంట్రప్రెన్యూర్‌లతో పాటు బాలీవుడ్ టు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం కేటీఆర్ చొరవని అభినందిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు.

కేటీఆర్ కి మద్దత్తుగా వీరందరూ ఎలన్‌మస్క్‌కి ఆహ్వానం పలుకుతున్నారు. అయితే ఈమేరకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ కోడలు బాలీవుడ్ హీరోయిన్ జెనీలియా దేశ్ ముఖ్ నుండి టాలీవుడ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ, నిఖిల్‌ సిద్ధార్థతో పాటు దర్శకుడులు మెహర్ రమేష్, గోపిచంద్‌ మలినేని సైతం కేటీఆర్‌, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే.. టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌కి స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేశారు. ఇక ప్రముఖ జర్నలిస్టులు పంకజ్‌ పంచౌరీ, సీనియర్‌ జర్నలిస్ట్‌ విక్రమ్‌ చంద్రా సైతం కేటీఆర్ ట్వీట్ కి మద్దత్తు పలికిన ప్రముఖుల్లో ఉన్నారు. ఇక తెలంగాణాలో పెట్టుబడుల కోసం కేటీఆర్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నా.. బీజేపీ నాయకులూ మాత్రం గింజుకుంటుండమ్ గమనార్హం. సోషల్ మీడియాలో వీరిపై నెటిజన్స్ గట్టిగ విమర్శలు చేస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాని బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం తగదని కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్స్.