Home Slider News పెన్సిల్ పోయింది.. కేసు పెట్టండని పీఎస్ కు వచ్చిన పిల్లలు

పెన్సిల్ పోయింది.. కేసు పెట్టండని పీఎస్ కు వచ్చిన పిల్లలు

Kurnool-Kids-Complaint-video

పెన్సిల్ దొంగతనం అయిదంటూ కేసు పెట్టేందుకు ఓ స్కూల్ పిల్లగాడు పోలీస్ స్టేషన్ మెట్లేక్కడం.. అక్కడ పోలీసులు అతన్ని కాంప్రమైజ్ అవ్వరా బాబు అంటూ బతిమిలాడటం.. దీనికి సంబంధించిన వీడియో ఓకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని పెద్దకడుబూరులో స్కూల్ పిల్లాడు హనుమంతు.. తన స్నేహితుడు పెన్సిల్ దొంగిలించాడని ఆరోపించాడు. ఇద్దరి మధ్య పెన్సిల్ లెక్క తేలకపోవడంతో తమ పంచాయతీని పోలీసుల దగ్గరకు తీసుకొచ్చారు.

తన పెన్సిల్ దొంగిలించాడని, దానికి సాక్ష్యం కూడా ఉందంటూ మరో స్నేహితుడిని హనుమంతు వెంటేసుకొచ్చి పోలీసుల ముందు నిలబెట్టాడు. అయితే కేసు పెట్టోద్దంటూ పోలీసులు హనుమంతుకు సర్దిచెప్పడం ఫన్నీగా ఉంది. ‘‘ఈ ఒక్కసారికి కాంప్రమైజ్ అవురా హనుమంతు.. కేసు పెడితే బెయిల్ దొరకడం కష్టం అవుతుంది.’’ అంటూ పోలీసులు హనుమంతుని బుజ్జగించి అక్కడి నుంచి పంపించి వేయడం ఆ వైరల్ వీడియోలో ఉంది.