11వ రౌండ్‌లో టీఆర్ఎస్ కు ఆధిక్యం

Huzurabad-byelection-counting

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు రౌండ్ రౌండ్ కి ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రతి రౌండ్ లో లీడ్ ఇరుపార్టీల నడుమ మారుతూ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు 11రౌండ్ల లెక్కింపు పూర్తి అయింది.

11వ రౌండ్‌లో టీఆర్ఎస్ మ‌ళ్లీ ఆధిక్యంలోకి వ‌చ్చింది. ఈట‌ల రాజేంద‌ర్‌పై, గెల్లు శ్రీ‌నివాస్ 367 ఓట్ల‌తో ఆధిక్యం సాధించారు. పదకొండో రౌండ్ లెక్కింపులో గెల్లు శ్రీనివాస్‎కు 4326 ఓట్లు.. ఈటలకు 3941 ఓట్లు, కాంగ్రెస్‎కు 104 ఓట్లు వచ్చాయి.

11వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 4,326 ఓట్లు వ‌చ్చాయి. ప్ర‌స్తుత 11వ రౌండ్ వ‌ర‌కూ 39,016 ఓట్లు టీఆర్ఎస్‌కు పోల‌య్యాయి. 11వ రౌండ్ ముగిసే సమయానికి  బీజేపీ అభ్యర్థి ఈటల 5,306 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.