నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్ కు సెలవు - TNews Telugu

నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్ కు సెలవుIndia Hits Over 1 Crore Vaccinations In A Day For 5th Time

ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు సెలవు ఇచ్చారు. రేపట్నుంచి నాలుగు రోజులపాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు సెల‌వు ఇయ్యాలని వైద్య సిబ్బంది ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

వైద్య సిబ్బంది విజ్ఞ‌ప్తి ప‌ట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు వైద్య సిబ్బందికి నాలుగు రోజుల పాటు సెల‌వు ప్ర‌క‌టిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.