నాగ‌ర్‌ క‌ర్నూల్ జిల్లాలో చిరుత సంచారం.. భయంలో గ్రామాలు

leopard

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో ఓ చిరుత పులి క‌ల‌క‌లం సృష్టిస్తోంది. వంగూరు మండ‌లంలోని ఉమ్మాపూర్ గ్రామంతో పాటు ఆ చుట్టుప‌క్క‌ల చిరుత పులి సంచ‌రిస్తున్న‌ట్లు గ్రామ‌స్తులు చెప్పారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, అట‌వీ శాఖ అధికారులు ఉమ్మాపూర్‌కు చేరుకుని పాద‌ముద్ర‌ల‌ను ప‌రిశీలించారు. అవి పులి అడుగుజాడ‌లే అని నిర్ధారించారు.

దీంతో ఆ గ్రామంతో పాటు స‌మీప గ్రామాల ప్ర‌జ‌ల‌కు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావాలంటేనే వ‌ణికిపోతున్నారు. పులి సంచారంపై నిఘా ఉంచుతామ‌ని, స్థానికులు ఎలాంటి భ‌యాందోళ‌న‌కు గురి కావాల్సిన అవ‌స‌రం లేద‌ని అట‌వీశాఖ అధికారులు తెలిపారు.