ఎమ్మెల్సీగా వాణీదేవిని గెలిపించి.. పీవీకి నివాళి ఇద్దాం: మంత్రులు

ఎమ్మెల్సీగా వాణీదేవిని గెలిపించడం ద్వారా తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పీవీకి సరైన నివాళి ఇద్దామని తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్,  మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహబూబ్ నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగింది. ఇందులో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల, డివిజన్ స్థాయి ఇంచార్జులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ అగ్రపథాన కొనసాగుతూ ట్రెండ్ సృష్టిస్తుంటే.. మరోవైపు దేశాన్ని అమ్మేస్తూ బీజేపీ దగా చేస్తుందని దుయ్యభట్టారు.

ప్రతిభను గుర్తించడంలో ముందుండే మన సీఎం కేసీఆర్.. పీవీ కుమార్తె, ఉన్నత విద్యావంతురాలు, మచ్చలేని వ్యక్తి సురభి వాణీదేవి ఎమ్మెల్సీగా పంపించడానికి సంసిద్దులైన విషయాన్ని విద్యావంతులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

ఆరేళ్లలో అధ్బుత ప్రగతిని సాధించిన తెలంగాణ అవకాశాలను సృష్టించుకుంటూ ముందుకుసాగుతుందన్నారు. ప్రభుత్వ రంగంలో కేవలం ఆరేళ్లలోనే లక్షా ముప్పైవేలకు పైగా ఉద్యోగాలను ఇవ్వడంతో పాటు, ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలను అందుభాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

అమేజాన్, గూగుల్, ఐకియా లాంటి ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిస్తూ ఎన్నో ఉద్యోగ అవకాశాల్ని మన తెలంగాణ యువతకు అందిస్తున్నదని తెలియజేశారు. సుస్థిరమైన పాలన, శాంతిభద్రతలు, కంపెనీలకు అనుమతులు ఇవ్వడంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఇది సాద్యమైందని మంత్రులు అన్నారు.

ఈ ఆరేళ్లలోనే అరవైఏళ్లలో తెలంగాణకు చేయలేని అభివృద్దిని మన టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందని.. ఓటువేసే సమయంలో వీటన్నింటిని పట్టభద్రులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

బీజేపీ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మోద్దని.. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాట్లాడిన జూటా మాటల్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ ఆరేళ్లలో పట్టభద్రుల సమస్యలపై ఒక్కనాడు మండలిలో ప్రశ్నించని రామచందర్ రావుని ఎదురు ప్రశ్నించాలని పట్టభద్రులకు సూచించారు.

ఐటీఐఆర్ ను మన హైదరాబాద్ కు ఇవ్వకుండా తన్నుకుపోయిన గద్దలు బీజేపీ నేతలనే విషయం మరవద్దని ఓటర్లను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ విజయం సాదిస్తుందని దీమా వ్యక్తం చేశారు.

శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల వస్తున్న పెట్టుబడుల గురించి తెలియజేశారు. నగరం ప్రశాంతంగా ఉండడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్దను కనభరుస్తున్న విషయాన్ని చెప్పారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదటి ప్రాదాన్యతా ఓటు సురభి వాణీదేవికి వేసి గెలిపించాలని కోరారు.

ప్రతీ ఓటరుని కలుసుకొని టీఆర్ఎస్ అభివృద్ది గురించి తెలియజేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాదించేలా ప్రణాళికా భద్దంగా పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి, ఎమ్మెల్సీలు, నగరంలోని కార్పోరేటర్లు, టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు.