ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పిడుగుపాటు

రాజ‌న్న సిరిసిల్లా జిల్లాలోని మామిడిప‌ల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంపై పిడుగు ప‌డింది. ఈ ఘటనలో ఐదుగురు రైతులు పిడుగు పాటుకు గుర‌య్యారు. తీవ్రంగా గాయపడ్డ రైతులను ఆస్ప‌త్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ రైతుల ప‌రిస్థితిపై జిల్లా క‌లెక్టర్ అధికారుల‌ను ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.

కామారెడ్డిలో పిడుగుపాటు. ఆరుగురికి గాయాలు

కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగు పాటుకు ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఇందులో రాజు, గంగుబాయి, భూలిలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.