స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని పది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అదిలాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉండగా.. కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నవంబర్ 23 వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. 24న నామినేషన్లు పరిశీలిస్తారు. నవంబర్ 26 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది. డిసెంబర్ నెల 10న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 14న కౌంటింగ్ జరిపి ఫలితం ప్రకటిస్తారు.