పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్ డౌన్

Lock down Continues In States
Lock down Continues In States

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వీకెండ్ లాక్‌డౌన్ కొనసాగుతోంది. కేసులు అధికంగా ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ల్లో వీకెండ్ లాక్‌డౌన్ కఠినంగా అమలుచేస్తున్నారు. తమిళనాడులో అత్యవసర సేవలు మినహా అన్ని సర్వీసులు, షాపులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Lock down Continues In States
Lock down Continues In States

అక్కడ రేపటి నుంచి బ్యూటీపార్లర్లు, సెలూన్లు, స్పాలను మూసివేయనున్నారు. హోటళ్లలో కేవలం పార్శిల్‌ సర్వీసులకు మాత్రమే అనుమతి ఉండనుంది. అటు ఉత్తరప్రదేశ్‌లో శని, ఆదివారాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. గోరఖ్‌పూర్‌తో పాటూ, కేసులు అధికంగా ఉన్న నగరాల్లో శానిటైజేషన్ చేపట్టారు. ఇక కర్ణాటకలో వీకెండ్ లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తున్నవారిపై చర్యలు తీసుకుంటున్నారు.