ప్రేమికుడి పానీ పూరీ ఐడియా.. గర్ల్ ఫ్రెండ్ కి డిఫరెంట్ గా ప్రపోజల్ - TNews Telugu

ప్రేమికుడి పానీ పూరీ ఐడియా.. గర్ల్ ఫ్రెండ్ కి డిఫరెంట్ గా ప్రపోజల్ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు అబ్బాయిలు తెగ కష్టపడుతూ ఉంటారు. అమ్మాయిల అభిరుచులు, ఇష్టాలకు తగ్గట్టుగా కొందరు అబ్బాయిలు తమదైన స్టైల్ లో ప్రేయసికి అందమైన బహుమతులను ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. కొందరు రెడ్ రోజెస్ తో.. మరి కొందరు మోకాళ్ల పై నిల్చోని రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఓ వ్యక్తి మాత్రం డిఫరెంట్ గా పానీ పూరీలో రింగ్ ను ఉంచి తన ప్రేయ‌సిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు.


ఓ అమర ప్రేమికుడు తన ప్రియురాలికి పానీపూరిలో రింగ్ ను ఉంచి ప్రపోజ్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మంత్లీ అందాజ్ ఈ జ‌హ‌న్ అనే పేజ్.. వీరి వెడ్డింగ్ ప్ర‌పోజ‌ల్ ఫోటోల‌ను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. దీనిపై నెటిజ‌న్లు రకరకాలుగా కామెంట్ చేశారు. ర‌బ్నే బ‌నాది జోడి అని ఓ యూజ‌ర్ రియాక్ట‌వ‌గా, ఇలా ప్ర‌పోజ్ చేయ‌డం మంచి ఆలోచ‌న కాద‌ని, కొంద‌రు అమ్మాయిలు పానీపూరీల‌ను న‌మిలేస్తుంటారు జాగ్ర‌త్త అంటూ మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశాడు.