వికారాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

lovers

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నవపేట్ మండలం కలిచర్ల గ్రామ సమీపంలో ఓ ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వీరిద్దరూ మైనర్ లే కావడం గమనార్హం.

నవపేట్ మండలం కడిచర్ల గ్రామానికి చెందిన పవన్ (18), ధరూరు మండలం ఎబ్బనూరు గ్రామానికి చెందిన అభినయ (17).. వీరిద్దరి కులాలు వేరు కావడం, ఇద్దరు మైనర్లు కావడంతో తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరనే భయంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.