లూసీఫర్ రీమేక్.. అదిరిపోయే టైటిల్ కన్ఫర్మ్..!

మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు అదిరిపోయే టైటిల్ కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. మ‌ల‌యాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్.. కథ నచ్చడంతో తెలుగులో రీమేక్ చేయడానికి చిరంజీవి సన్నాహాలు చేస్తున్నాడు.

చిరు ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య పూర్తి కాక ముందే మరో రెండు సినిమాలు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. ఇందులో ఒకటి లూసీఫర్ రీమేక్. సీనియర్ రైటర్ సత్యానంద్, లక్ష్మీ భూపాల లూసీఫర్ కోసం పనిచేస్తున్నారు. ఏప్రిల్లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందనుకున్నా.. కరోనాతో ఆలస్యం అవుతుంది. తాజాగా ఈ సినిమాకు ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌ని ప్ర‌చారం సాగుతోంది.

లూసీఫర్ రీమేక్ కు ‘కింగ్ మేకర్’ టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కు సరిపోయే టైటిల్ కావడంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.