‘మా’లో తాజా మంటలు..హేమపై వేటు.. మెగాస్టార్ లెటర్ ఎఫెక్ట్ ?

Maa Elections: Actress Hema May Suspended From Maa
Maa Elections: Actress Hema May Suspended From Maa
Maa Elections: Actress Hema May Suspended From Maa
Maa Elections: Actress Hema May Suspended From Maa

మా ఎన్నికల ప్రకంపనలు రోజురోజుకి హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా హేమ రచ్చకెక్కి చేస్తున్న హంగామాతో మా వివాదం మరింత ముదురుతోంది. మా అధ్యక్షుడు నరేష్ ని టార్గెట్ చేస్తూ హేమ చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. నిన్న లీక్ అయిన హేమ ఆడియో లీక్ వివాదం మెగాస్టార్ ఎంట్రీ వరకు వెళ్ళింది. హేమ ఆడియో లీక్ అవ్వటం.. అందులో నరేష్ పై సంచలన ఆరోపణలు చేసింది హేమ. దాంతో నరేష్ కి అధ్యక్ష ఎన్నికలు జరగడమే ఇష్టం లేదని.. హాయిగా మరో టర్మ్ కూడా అతనే పదవిలో ఉండాలనుకుంటున్నాడని నరేష్ గుట్టు రట్టు చేస్తూ హేమ తీవ్ర ఆరోపణలు చేసింది.

దీనికి కౌంటర్ గా హేమపై ముప్పేట దాడికి దిగారు నరేష్ అండ్ కో. హేమ హద్దులు ధాటి మాట్లాడుతుందని.. చర్యలు తప్పవని మా అధ్యక్షుడు నరేష్ వార్ణింగ్ ఇచ్చాడు. ఇక ఇంతలోనే ఒక సంచలన లేఖతో మా సీన్ లోకి సడర్న్ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. వెంటనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని మా క్రమశిక్షణ సంఘం ఛైర్మెన్ కృష్ణం రాజుకి లేక రాసారు మెగాస్టార్. ‘మా’లో మరిన్ని గొడవలు రాకముందే ఎన్నికలు నిర్వహించాలని చిరంజీవి లేఖ రాసిన రెండు రోజులకే ఇప్పుడు తాజాగా మా అధ్యక్షుడు నరేష్ మరో షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారట.

Maa Elections: Actress Hema May Suspended From Maa
Maa Elections: Actress Hema May Suspended From Maa

శనివారం ఫిలిం ఛాంబర్‌‌‌లో కొందరు మా సభ్యులు ప్రెస్ మీట్‌‌‌ను ఏర్పాటు చేశారు. “మా” నిబంధనలను ఉల్లంఘించిన కొందరు మా సభ్యుల పై క్రమ శిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజుకి పిర్యాదు చేశారు మా సభ్యులు. దాదాపు వందకు పైగా సభ్యుల సంతకాలతో ఫిర్యాదును సిద్ధం చేశారు. దీంతో హేమపైనే అందరు ఫిర్యాదు చేసి ఉంటారని అనుకుంటున్నారు. హేమని ఆడ్డుతొలగించుకుంటే ఎన్నికలను మరికొన్ని రోజులు వాయిదా వేయొచ్చని కొందరు ప్లాన్ చేస్తున్నారని హేమ మద్దత్తు దారులు ఆరోపిస్తున్నారు. ఇక మా ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించే సభ్యులను ఉపేక్షించ వద్దు అని చిరంజీవి కృష్ణంరాజును కోరారు. మరో వైపు ఈ నెల 22 న మా జనరల్ బాడీ మీటింగ్‌‌‌లో మా ఎలక్షన్స్ తేదీ ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది.

 

స్త్రీ నిధి బ్యాంక్ లింకేజ్ కి వడ్డీ లేని రుణాలు