మా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శనివారం నాడు మా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 10న ‘ గంటల నుంచి 2 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జూబ్లీ హిల్స్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికలకు ఏర్పాట్లు చేయనున్నారు. అదే రోజు ఓట్లు కూడా లెక్కించి.. ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా.. ఈసారి మా అధ్యక్ష పదవికి చాలామంది పోటీ పడుతుండటంతో ఈ సారి మా ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి.

అయితే.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ఇండస్ట్రీ గ్రూపులు గ్రూపులుగా విడిపోయింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సారి మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు అద్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. కాగా ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ సభ్యులను ప్రకటించేశారు. మంచు విష్ణు ప్యానెల్ లో రఘుబాబు, బాబు మోహన్ లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నామినేషన్ల తేదీ నాటికి విష్ణు పూర్తి ప్యానెల్ ను ప్రకటిస్తాడని టాక్.
షెడ్యూల్ ఇదే..
సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. సెప్టెంబర్ 30న నామినేషన్లు పరిశీలిస్తారు. అక్టోబర్ 2 నాడు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 2న సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అక్టోబర్ 10న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు కూడా వెల్లడిస్తారు.

పాటించాల్సిన రూల్స్
ఒక అభ్యర్థి ఒక పోస్టు కోసం మాత్రమే పోటీ చేయాలి.
గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి.. 50 శాతం కంటే తక్కువ మీటింగ్‌లకు హాజరైతే పోటీకి అనర్హులు.
24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్ బేరర్స్‌గా ఉన్న వారు మా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ పదవులకు రాజీనామా చేయాలి.
కరోనా మార్గదర్శకాలను పాటించాలి. నామినేషన్ సమర్పణ, ఓటింగ్ సమయంలో మాస్కు తప్పనిసరిగా ఉండాలి.
సీనియర్ సిటిజన్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం
పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు.