వాళ్ల రాజీనామా లేఖలు ఇంకా అందలేదు: మంచు విష్ణు

Maa president manchu vishnu visited tirumala along with his panel members today

Maa president manchu vishnu visited tirumala along with his panel members today

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు దీనిపై స్పందించారు. తన తండ్రి మోహన్‌బాబు, ప్యానెల్‌ సభ్యులతో కలిసి ఆయన సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు.. తన ప్యానల్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడితేనే తాను అధ్యక్షుడైనట్లు చెప్పాడు. స్వామివారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చామని తెలిపారు. అయితే.. తనకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేశారని మీడియా ద్వారానే తెలిసిందని.. ఇప్పటి వరకూ తన వద్దకు రాజీనామా లేఖలు రాలేదని సంచలన కామెంట్స్ చేశారు విష్ణు. మా వద్దకు రాజీనామా లేఖలు వస్తే అప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుతానని అన్నారు.