‘మా’ వివాదంలో మరో ట్విస్ట్.. నటి హేమకు షోకాజ్‌ నోటీసులు.. తెరవెనుక అసలు ఏం జరుగుతుంది ?

MAA Show Cause Notice Issued to actress Hema
MAA Show Cause Notice Issued to actress Hema
MAA Show Cause Notice Issued to actress Hema
MAA Show Cause Notice Issued to actress Hema

మా అధ్యక్ష ఎన్నికల పేరు మీద సినీ ఇండస్ట్రీ సభ్యులు రచ్చకెక్కుతున్నారా.. సాధారణ రాజకీయ ఎన్నికల వేడిని తలపిస్తూ ఏకంగా ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం ఎన్నికల బరిలో దిగి రోజు తిట్టుకోవటం ఏంటి అంటూ.. నలువైపులా నుండి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిన్న మెగాస్టార్ చిరంజీవి లేఖ ఇండస్ట్రీలో కలకలం రేపింది. తక్షణమే మా ఎన్నికలు నిర్వహించాలంటూ మా క్రమశిక్షణ సంఘం ఛైర్మెన్ కృష్ణం రాజుకి లేఖ రాసాడు చిరంజీవి.

ఇక మెగాస్టార్ లేఖ రాయడానికి ప్రధాన కారణం మొన్న లీక్ అయిన హేమ ఆడియో టేప్ అని తెలుస్తుంది. అందులో    మా అధ్యక్దుడు నరేష్ పై తీవ్ర విమర్శలు చేసిన హేమ ఒక్కసారిగా మీడియాలో హైలైట్ అయింది. నరేష్ కావాలనే ఎన్నికలు జరగనివ్వకుండా అడ్డుకుంటున్నాడని, కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని, ఒక పైసా కూడా కొత్తగా ఫండ్ జమ చేయలేకపోయాడని హేమ చేసిన ప్రధాన ఆరోపణలకు.. నరేష్, జీవిత రాజశేఖర్ లు కూడా నిన్న స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు. ఈ వివాదం మరింత ముదరటం మంచిదికాదన్న లెక్కతోనే చిరు లేక రాసారు.

ఇక చిరు లెటర్ ఇష్యుతో పాటు.. లేటెస్ట్ గా ఈ ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్ వచ్చిపడింది. నటి హేహకు ‘మా’ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ హేమకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇక మా’ ఎన్నికలు జరపాలంటూ హేమ సంతకాల సేకరణ ప్రారంభించారు. ఇక ఈసారి మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమలతో పాటు సీవీఎల్‌ నరసింహారావు ఉన్నారు.