మహబూబ్ నగర్ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం

ఇప్పటికే మూడు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం కాగా.. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు కూడా టీఆర్ఎస్ ఖాతాలోనే పడ్డాయి. కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


వీరిపై పోటీ చేస్తూ నామినేషన్లు వేసిన స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవం లాంఛనం అయింది. ఎన్నికల అధికారి తెరాస అభ్యర్థుల ఏకగ్రీవాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. తాజా ఏకగ్రీవాలతో టీఆర్ఎస్ ఇప్పటి వరకు ఐదు ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది.