బీజేపీ గుట్టురట్టు.. షారుఖ్ కొడుకుని కిడ్నాప్ చేశారా.. ఎంత డబ్బు డిమాండ్ చేశారు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

Maharashtra Minister Nawab Malik Controversial Comments On Shahrukh Khan Son Drugs Case
Maharashtra Minister Nawab Malik Controversial Comments On Shahrukh Khan Son Drugs Case

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ వివాదం రోజుకొక మలుపు తిరుగుతుంది. ఆర్యన్ అరెస్ట్ వెనుకాల డ్రగ్స్ కారణమా లేదంటే వ్యక్తిగత కక్షలు ఎమన్నా ఉన్నాయా అని ఎన్నో రోజులుగా మీడియాలో చర్చ నడుస్తుంది. అయితే ఈ వార్తకి అనుగుణంగానే ఇప్పుడిప్పుడే కొన్ని షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. షారుఖ్ కొడుకు అరెస్ట్ అవ్వకముందు కిడ్నప్ జరిగిందని.. డ్రగ్స్ వ్యవహారంలో దొరిపోయాడని.. బయటపడాలంటే డబ్బులు ఇవ్వాలని షారుఖ్ ఖాన్ ని బెదిరింపులు వచ్చాయని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పై చెప్పిన ఆరోపణలన్నీ ఏకంగా బీజేపీ నాయకులపై నేషనల్ మీడియాలో వస్తున్నాయి. ఇప్పటికే ఆర్యన్ డ్రగ్స్ కేసులో సంచలన ఆరోపణలు చేస్తున్న మహరాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మళ్ళీ ఒక బాంబ్ పేల్చాడు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కి ముందు కిడ్నప్ జరిగిందని.. ఈ కిడ్నాప్ డ్రామాకు మాస్టర్ మైండ్ బీజేపీ నేత మోహిత్ కంబోజ్ అని ఆరోపించారు నవాబ్ మాలిక్. ఆర్యన్ అసలు క్రూయిజ్ టికెట్టే కొనలేదన్నారు. ప్రతీక్ గాబా, ఆమిర్ ఫర్నీచర్ వాలా అనే ఇద్దరు ఆర్యన్‌ను తీసుకెళ్లారని చెప్పారు. ఈ కేసు పూర్వ విచారణ అధికారి అయిన సమీర్ వాంఖడేతో కలిసి మోహిత్ కంబోజ్ ఆర్యన్‌ను కిడ్నాప్ చేశారన్నారు మహరాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్.