ఎవరు మీలో కోటీశ్వరుడులో మహేష్ బాబు.. ఎంత గెలుచుకున్నాడో తెలుసా? - TNews Telugu

ఎవరు మీలో కోటీశ్వరుడులో మహేష్ బాబు.. ఎంత గెలుచుకున్నాడో తెలుసా?Mahesh Babu Participated In Evaru Meelo Kotishwarudu Show With NTR
Mahesh Babu Participated In Evaru Meelo Kotishwarudu Show With NTR

బుల్లితెర మీద కూడా దుమ్ము రేపగలను అని నిరూపించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి తన సత్తా చాటుతున్నాడు. గతంలో స్టార్ మా లో బిగ్ బాస్ షో హోస్ట్ గా చేసి.. ఇప్పుడు మరోసారి జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. సక్సెస్ గా సాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా సందడి చేస్తున్నారు. తొలి ఎపిసోడ్ రామ్ చరణ్ తో మొదలు పెట్టి ఆ తర్వాత దర్శకులు రాజమౌళి, కొరటాల శివలతో మరో సెలబ్రిటీ ఎపిసోడ్ చేశాడు.

Mahesh Babu Participated In Evaru Meelo Kotishwarudu Show With NTR
Mahesh Babu Participated In Evaru Meelo Kotishwarudu Show With NTR

కాగా ఈ సారి తారక్.. మరో సెలెబ్రిటీతో ఎపిసోడ్ చేయనున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎవరు మీలో కోటీశ్వరుడు షూటింగ్ లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే అయిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దసరా సందర్భంగా ఈ ఎపిసోడ్ రిలీజ్ చేస్తారట. అయితే.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు మహేశ్ బాబు సమాధానాలిచ్చాడా? ఎంత గెలుచుకున్నాడు? అని తెగ చర్చ నడుస్తోందిప్పుడు. తారక్ – మహేశ్ ల మధ్య జరిగిన సంభాషణ ఇద్దరు హీరోల అభిమానులకు మంచి కిక్కి్స్తుందట. కాగా ఈ ఆటలో మహేశ్ బాబు రూ.25 లక్షలు గెలుచుకున్నాడట. ఆ మొత్తాన్ని ఛారిటీకి డొనేట్ చేశాడట. త్వరలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఈ షో లో పాల్గొననున్నాడని సమాచారం.