పెట్రోల్ ధరలు భరించలేక.. బైకు తగలబెట్టేశాడు

Man Burned His Bike Due to not bare Petrol Price
Man Burned His Bike Due to not bare Petrol Price

పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. నిత్యావసర ధరలతో పాటు.. పెట్రోల్ ధరలు కూడా మోయలేని భారంగా మారడంతో సామాన్యులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. పెట్రోల్ పోసి బండి నడపటం భారంగా మారిందని తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టి తగలబెట్టాడు.

Man Burned His Bike Due to not bare Petrol Price
Man Burned His Bike Due to not bare Petrol Price

జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రానికి చెందిన కుర్వ ఆంజనేయులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెరిగిన పెట్రోల్ ధరలు భారంగా మారడంతో మండలంలోని వైఎస్ఆర్ చౌరస్తాలో తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టి దహనం చేశాడు. సకాలంలో స్పందించిన స్థానికులు బైకు పూర్తిగా కాలిపోకుండా నీళ్లు పోసి మంటలు ఆర్పేశారు. వ్యవసాయం చేసుకుంటూ బతికే తనకు పెట్రోల్ ధరలు భారంగా మారాయని.. పంట మీద లాభం లేకపోగా.. పైగా ఈ అదనపు భారం మోయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధ్యత లేని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు అదుపు చేయలేకపోవడం వల్ల సామాన్యులు పడే కష్టాలకు కారణమవుతుందని అన్నాడు.