జమ్మికుంటలో దారుణం.. హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు

man murdered and burnt in jammikunta , sangareddy district

man murdered and burnt in jammikunta , sangareddy district

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలో దారుణం జరిగింది. మండలంలోని విలాసాగర్‌లో ఓ వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అనంతరం అతడిని పెట్రోల్‌ పోసి తగులపెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన వ్యక్తిని విలాసాగర్‌కు చెందిన సంతోష్‌ కుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.