కటింగ్ చేయలేదని సెలూన్ షాప్ వ్యక్తిపై కాల్పులు

పాత బకాయి కట్టే వరకు కటింగ్ చేసేది లేదన్నందుకు సెలూన్ షాప్ వ్యక్తిని చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. బులంద్ షహర్ జిల్లాలోని అగౌతాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సెలూన్ నడుపుతున్న ఇర్ఫాన్ దగ్గరికి సమీర్ అనే వ్యక్తి క్షవరం కోసం వచ్చాడు.

అయితే గతంలో బాకీ పడ్డ డబ్బులు ఇవ్వాలని లేదంటే కటింగ్ చేయనని సమీర్ కు ఇర్ఫాన్ స్పష్టం చేశాడు. దీంతో సమీర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన దగ్గర ఉన్న తుపాకీతో ఇర్ఫాన్ మీద కాల్పులు జరిపాడు. అతడి సోదరుడిని కూడా గాయపరిచాడు. ఈ ఘటనలో ఇర్ఫాన్ అక్కడిక్కడే చనిపోగా.. అతడి సోదరుడిని హాస్పిటల్ లో చేర్పించారు.